15 April, 2026 | 3:16 AM

డెక్కన్ సిమెంట్స్ కర్మాగారంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు

15-04-2026 12:55 AM

పాలకవీడు, ఏప్రిల్: 14 మండలంలోని భవానిపురం సున్నపురాయి గని డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కర్మాగారంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం రోజు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యన్. శ్రీనివాసరాజు, సేఫ్టీ కమిటి జనరల్ సెక్రటరి పి.యస్.రావ్ వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యన్. శ్రీనివాసరాజు మాట్లాడుతూ 2026 సంవత్సరపు జాతీయ అగ్నిమాపక వారోత్సవాల నినాదం అయిన సురక్షితమైన పాఠశాల, సురక్షితమైన వైద్యశాల, అగ్ని ప్రమాదాల భద్రతపై అవగాహన గల సమాజం, ఇవన్నీ సమిష్టిగా అగ్ని ప్రమాదాలను నిలువరించే ముందస్తు చర్యలు అనే నినాదం గురించి వివరిస్తూ ముఖ్యంగా పాఠశాలలందు, ఆసుపత్రుల యందు అగ్నిప్ర మాదాలను నిరోధించే పరికరాల ఏర్పాటుచేసి నిరంతరం వాటిని పర్యవేక్షించాలని మరియు అగ్నిప్రమాదాల గురించి టీచర్లకు, విధ్యార్ధులకు, హాస్పిటల్స్ సిబ్బందికి, ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కలిగించాల న్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సేఫ్టీ కన్వీనర్ మనోహర్ గౌడ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.