3 July, 2026 | 9:31 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

30-05-2025 01:15 AM

నాగల్ గిద్ద, మే 29:  మండలంలోని శిఖర్ ఖాన గ్రామంలో గురువారం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, అన్ని  వర్గాలకు హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. కులవివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించాలని అన్నారు. 

గ్రామంలో 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్  మంజూరు చేస్తానని అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం, అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీం, మండల నాయకులు గుండె రావు పాటిల్,

అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గణపతి, కెపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు, అంబేద్కర్ పూలే డివిజన్ అధ్యక్షులు ఎస్ నరసింహులు, కెపిఎస్ జిల్లా నాయకులు ఎస్ గణపతి, మాజీ సర్పంచ్ అనిల్  పాటిల్, గ్రామ పెద్దలు సోమనాథ్, గంగిశెట్టి, సంగిశెట్టి, రాజ్కుమార్  పాల్గొన్నారు.