3 July, 2026 | 8:42 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతాం

30-05-2025 01:14 AM

రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు మంజూరులో

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో, కలెక్టర్లతో మంత్రి జూపల్లి ప్రత్యేక సమావేశం ఇబ్బందులు మంత్రికి వివరించిన ఎమ్మెల్యే 

ఎల్లారెడ్డి, మే 29 (విజయక్రాంతి): ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లతో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులతో జిల్లా కలెక్టర్లతో పలు సమస్యలపై చర్చించారు.

అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రికి విన్నవించారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం సంబంధించిన గ్రామీణ సమస్యల పట్ల మంత్రికి తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యం తరలించడంలో జాప్యంపై మంత్రితో చర్చించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ సమస్య విన్న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమస్య తలెత్తకుండా సామరస్యంగా జరిగే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఆశీస్ సంగ్వాన్, ఉమ్మడి జిల్లాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.