18-11-2025 11:18:08 AM
మోడసా: గుజరాత్‌లోని(Gujarat) ఆరావళి జిల్లాలోని మోడసా పట్టణం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్‌లో మంటలు(Ambulance catches fire) చెలరేగడంతో నవజాత శిశువు, ఒక వైద్యుడు, మరో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... అహ్మదాబాద్‌లోని ఆరెంజ్ హాస్పిటల్ నుండి వచ్చిన అంబులెన్స్ మంటల్లో చిక్కుకుంది. ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక నవజాత శిశువు, శిశువు తండ్రి మృతి చెందారు. డ్రైవర్, బంధువును స్థానికులు రక్షించారు. మోడసా అగ్నిమాపక విభాగం వెంటనే మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నాయాని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.