18-11-2025 01:12:16 PM
విశాఖపట్నం: మావోయిస్టు పార్టీకి(Communist Party of India) పెద్ద దెబ్బగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మద్వి హిడ్మా(Maoist commander Madvi Hidma) మంగళవారం మారేడుమిల్లి అడవుల్లో ప్రత్యేక పోలీసు దళాలతో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య ఎన్‌కౌంటర్(Encounter) జరిగిందని, ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ బర్దార్ తెలిపారు.
దేశంలో ఉన్నత స్థాయి మావోయిస్టు నాయకులలో ఒకరైన హిడ్మా, గత దశాబ్దంన్నర కాలంలో భద్రతా దళాలపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులకు నాయకత్వం వహించాడు. 2010 దంతెవాడ మారణకాండలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2013లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహా 27 మంది ప్రాణాలను బలిగొన్న జిరామ్ ఘాటి దాడి. 2021లో సుక్మా-బీజాపూర్‌లో జరిగిన ఆకస్మిక దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిలో హిడ్మా కీలక సూత్రధారి అని అనుమానిస్తున్నారు. భద్రతా దళాలు ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
చనిపోయిన మావోయిస్టు వివరాలు: సెంట్రల్ కమిటీ సభ్యుడు(హిడ్మా), డివిజన్ కమిటీ మెంబర్ హిడ్మా భార్య (మడగం రాజే అలియాస్ రాజక్క), మావోయిస్టులు చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవ్ మృతిచెందారు.