calender_icon.png 11 February, 2026 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీ కొట్టిన అంబులెన్స్

11-02-2026 03:30:35 AM

  1. ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
  2. వనస్థలిపురంలో ఘటన

ఎల్బీనగర్, ఫిబ్రవరి 10 : ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డా డు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ తోపాటు రోగి, అతని సహయకురాలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే... మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఒక లారీ (TG07U 5018) హయతనగర్ నుంచి వనస్థలిపురం వెళ్తుండగా మార్గమద్యంలో డీర్ పార్కు వద్ద రోడ్డు పక్కకు వెళ్తుండగా అదే సమయములో ఇద్దరు రోగులను దవాఖానకు తీసుకెళ్తున్న అంబులెన్స్ (TS11UB 3291) వెనుక నుంచి ఢీకొట్టింది. అంబులెన్స్ డ్రైవరు అతి వేగంగా అజాగ్రత్త నడుపుకుంటూ లారీని వెనుక భాగం నుంచి ఢీకొట్టాడు.

ఈ రోడ్డు ప్రమాదంలో రోగి పాండయ్య అతని సహయకురాలు చంద్రకళ, అంబులెన్స్ డ్రైవర్ చొప్పరి కుమార స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాండయ్య ఫిర్యాదు మేరకు అంబులెన్స్ డ్రైవర్ కుమార స్వామిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు.