calender_icon.png 8 December, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించిన ఏఎంసీ వైస్‌ చైర్మన్ కనికరపు రాకేష్

08-12-2025 05:43:38 PM

వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో 169వ బూత్ పరిధిలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను తప్పుదారి పట్టించడం వారి లక్ష్యమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు “ఓటు చోరీ కార్యక్రమం”లో భాగంగా ఇంటింటా తిరిగి మోడీ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ ప్రచారం మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు.