calender_icon.png 23 January, 2026 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ

19-09-2024 01:52:27 AM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పకడ్బందీగా ఓటరు జాబితా స వరణ చేయాలని, ఓటు ప్రాముఖ్యతపై జిల్లాలోని ప్రతి ఓటరుకు అవగాహన కల్పించి చై తన్యం తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బు ధవారం మహబూబాబాద్‌లో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సి బ్బందితో నూతన ఓటర్ల నమోదు, సర్వే, పో లింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్‌తో కలిసి సమీ క్షా సమావేశం నిర్వహించారు. 1,500 మంది ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనంగా మరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని కాలనీలలో జరుగుతున్న ఓటరు సర్వేను పరిశీలించారు.