calender_icon.png 23 January, 2026 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ ప్రొఫెసర్ మనోహర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

23-01-2026 08:03:05 PM

బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ

మునుగోడు,(విజయక్రాంతి): సస్పెండ్ చేసిన యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ మనోహర్ ను వెంటనే విధుల్లోకి బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు. విసి పదవులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఉన్న పదవుల్ని సస్పెండ్ చేయడం కాకుండా బీసీలను సస్పెండ్ చేసి అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యూనివర్సిటీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యతను దెబ్బ  తీయడానికి యూనివర్సిటీలో కొందరు శక్తులు కుట్ల చేస్తున్నారని దీనికి ఆజ్యం పోసే విధంగా యూనివర్సిటీ రిజిస్టర్ నరేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిని ఉపాధ్యాయ సమాజం గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించకుండా ఉండాలని వారన్నారు.యూనివర్సిటీలో పదవి ఇవ్వకపోగా ఉన్న ప్రొఫెసర్ ఉద్యోగాలు తొలగిస్తున్నారని, బీసీలపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే తక్షణమే ప్రొఫెసర్ మనోహర్ ను వెంటనే వీధిలోకి తీసుకోవాలని  డిమాండ్ చేశారు.