calender_icon.png 8 December, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీడ్ బిల్ లో సవరణలు చేపట్టాలి

08-12-2025 07:32:32 PM

* కేంద్రానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేసిన డీలర్లు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కేంద్రం ప్రవేశ పెట్టే నూతన సీడ్ బిల్ 2025లో రైతులకు, డీలర్స్ కి సంబందించిన కొన్ని సవరణలు కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఆగ్రో డీలర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం డీలర్స్ అందరూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్ కు చేరుకుని బిల్ లో సవరణలను చేసే అంశాలను, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతులు నూతన సవరణ ద్వారా నష్ట పోయే అంశాలను, ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితులను అర్ధం చేసుకుని నష్ట పరిహారానికి సంబంధించిన సవరణను పొందుపర్చాలని, రైతులను ఆదుకోవాలని డీలర్ లు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్, కంఠం శంకర్, గండ్రత్ సంతోష్, కత్తూరి ప్రశాంత్, కిషోర్, రాజ్ కుమార్, శ్రీకాంత్, నాళం రాకేష్, ప్రకాష్ రెడ్డి, వాసవి శ్రీనివాస్, రేణుకా సతీష్ , వివిధ మండలాల్లో ఉన్న డీలర్లు పాల్గొన్నారు.