08-12-2025 07:26:39 PM
- నరసింహులపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..
- ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు..
బెజ్జంకి: గ్రామాభివృద్ధి ఎవరితోని సాధ్యమవుతుందో వారినే ఎన్నికలు లేకుండా నరసింహ పల్లె ప్రజలే నిర్ణయించుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామం నుంచి ఒకటే నామినేషన్ వేయించి సర్పంచ్ గా జెట్టి రమేష్, ఉపసర్పంచ్ గా జెట్టి శ్రీకాంత్, వార్డు సభ్యులుగా ఏలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సోమవారం రోజు ఏకగ్రీవం అనుకోబడ్డ సర్పంచ్ ను ఎంపీడీఓ ప్రవీణ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామానికి సేవకునిగా ఉంటూ, గ్రామాభివృద్ధి కోసం తోడ్పడుతానని అభివృద్ధిలో గ్రామాన్ని ముందు వరుసలో ఉంచుతానని తెలిపారు.