calender_icon.png 23 May, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా అమెరికాలోనే ఉంది

23-05-2025 12:00:00 AM

  1. కాల్పుల విరమణలో వారి పాత్రేం లేదు
  2. పాక్ ఆర్మీనే మొదట అభ్యర్థించింది
  3. ఆపరేషన్ సిందూర్ అలాగే కొనసాగుతోంది
  4. వెల్లడించిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, మే 22: భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం క్రెడిట్ తనదే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్రేమీ లేదని అధికారులు, మంత్రులు స్పష్టం చేసినా కానీ ట్రంప్ తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఈ అంశంపై తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఇంటర్వ్యూలో కూడా కాల్పుల విరమణలో అమెరికా పాత్ర గురించి ప్రశ్న ఎదురుకాగా అమెరికా అమెరికాలోనే ఉందన్నారు.‘ కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదు. అమెరికా విదేశాంగ మంత్రి, ఉపాధ్యక్షుడు ఫోన్ చేశారు. ఒక్క అమెరికానే కాదు చాలా దేశాలు ఆ సమయంలో ఫోన్ చేశాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నపుడు వేరే దేశాలు ఫోన్ చేయడం సహజమే.

కాల్పులు ఆపాలంటే పాకిస్థానే నేరుగా సంప్రదించాలనే విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పాం. పాక్ డీజీఎంవో భారత డీజీఎంవోను మొదట సం ప్రదించారు. తర్వాతే విరమణ ఒప్పందం కుదిరిం ది. ఈ ఒప్పందం భారత్-పాకిస్థాన్ నడుమే జరిగింది. ద్వైపాక్షికంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నాం.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవా దులను మట్టుబెట్టేందుకే ఈ ఆపరేషన్ చేపట్టాం. వారు ఎక్కడున్నా వారిని వదిలిపెట్టం. మొదటి నుంచీ పాకిస్థాన్ వక్రబుద్ధిని చాటుతూనే ఉంది. స్వాతంత్య్ర సమయం నుంచే ఇది చూస్తున్నాం. అప్పుడు పాక్ ప్రాక్సీ దళాలను పంపి.. వారు గిరిజనులని చూపే ప్రయత్నం చేసింది.

మే 10న హాట్ లైన్ ద్వారా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. మేము వారి అభ్యర్థనను అంగీకరించాం. కశ్మీర్ అనేది భారత్‌లో ఒకభాగం. కశ్మీర్ భూభాగంలో ఏ దేశానికి కూడా హక్కు లేదు. 1947-48 నుంచి కశ్మీర్‌లోని ఒక ప్రాంతం పాక్ ఆధీనంలో ఉంది.

వారు ఆ భూభాగాన్ని వదిలేందుకు సిద్ధమైతే మేము వారితో చర్చించాలని ఉ న్నాం.’ పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై విదేశాంగ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి నిర్మాణాలకు ప్రతిపాదనలు వస్తున్నాయనే ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు.