21 May, 2026 | 3:17 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

నేడు ఉగాది ఉత్సవాలు

18-03-2026 02:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం ఉగాది తెలంగాణ జానపద కళా జాతర నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో పొన్నం నారాయణ గౌడ్, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ కే కిరణ్ కుమార్ తదితరు మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో నిర్వహించి ఈ ఉత్సవాలకు జబర్దస్త్ కళాకారులు సుధాకర్ వినోదిని ప్రవీణ్ హాజరవుతారు అన్నారు, ఉగాది పండుగ ప్రాధాన్యత, ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ యజ్ఞం నిర్వహిస్తామన్నారు, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పొడెలి చిన్నయ్య ప్రధాన కార్యదర్శి గురుమూర్తి కమిటీ సభ్యులు వెన్నెల చిన్నయ్య నరసయ్య తదితరులు ఉన్నారు