18 March, 2026 | 3:56 PM

పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి

18-03-2026 02:25 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అకస్మిక తనిఖీ నిర్వహించి పరిక్ష తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పదవ తరగతి పరీక్షలను ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల కొరకు 38 కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరిగిందని 6948 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, త్రాగు నీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచమన్నారు. జిల్లాలో 2 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు ప్రతి పరీక్ష కేంద్రానికి సిట్టింగ్స్  స్క్వాడ్ బృందాలు, విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.