2 July, 2026 | 6:56 AM

అంతా మనోళ్లే

31-05-2024 01:32 AM

ఆటలో వేగం పెంచడంతో పాటు.. దాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో దాదాపు రెండు దశాబ్దాలకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్‌కు అంకురార్పణ చేసింది. మూడున్నర గంటల్లో ముగిసే మ్యాచ్‌లకు మంచి ఆదరణ దక్కడంతో.. 2007లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో ప్రపంచకప్ నిర్వహించింది. ఇక అప్పటి నుంచి ధనాధన్ ఆటతీరు ప్రజలకు బాగా చేరువైంది. ఒక సినిమా పూర్తయ్యేంతలో మ్యాచ్ ముగుస్తుండటంతో.. అభిమానులు సైతం దీనికి జై కోట్టారు. దీంతో ఈ ఫార్మాట్‌లో ప్రతి రెండేళ్లకోసారి ఐసీసీ వరల్డ్‌కప్ నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు టీ20 ప్రపంచకప్ జరగగా..

మరో రెండు రోజుల్లో తొమ్మిదో వరల్డ్‌కప్‌నకు తెరలేవనుంది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో ఈ సారి మెగాటోర్నీలో 20 జట్లకు అవకాశం ఇచ్చారు. ఆతిథ్య హోదాలో అమెరికా గ్రూప్ నుంచి బరిలోకి దిగనుంది. యూఎస్‌ఏ జట్టు ఏ ఫార్మాట్‌లోనైనా ప్రపంచకప్ ఆడటం ఇదే తొలిసారి కాగా.. దాదాపు 5 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్న అగ్రరాజ్యం.. ఆగమనాన్ని ఘనంగా చాటాలని భావిస్తోంది. 2028 లాస్‌ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయడం కూడా ఆ దేశంలో జెంటిల్మెన్ గేమ్‌కు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో..

ప్రపంచకప్‌లోని 16 మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మెగాటోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ కైవసం చేసుకున్న అమెరికా.. పొట్టి ప్రపంచకప్‌లో తామూ ప్రమాదకారులమే అని చాటు కుంది. యూఎస్ జట్టుకు మోనాంక్ పటేల్ సారథిగా వ్యవహరిస్తుండగా.. అలీ ఖాన్, హర్మీత్ సిం గ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, సౌరభ్, జహంగీర్ ఇలా పలువురు భారతీయు లు టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. టీమిండియాను విపరీతంగా ఆరాధించే అమెరికా ప్లేయ ర్లు.. జూన్ 12న జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 

ఆ రెండు జట్లలోని ఆటగాళ్ల పేర్లు పరిశీలిస్తే.. అందులో సింహభాగం ప్రవాస భారతీయులే కనిపిస్తారు. ఆటవిడుపు కోసం సరదాగా ప్రాక్టీస్ ప్రారంభించిన వారు కొందరైతే.. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తే వచ్చే పేరు ప్రతిష్టలు చూసి సీరియస్‌గా క్రికెట్ బాట పట్టినవారు మరికొందరు. ఆ రెండు దేశాల్లో ఒకటి అవకాశాల స్వర్గం అమెరికా అయితే.. రెండోది కెనడా! ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఈ రెండు దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాన్ని సొమ్ము చేసుకోవాలనే ఐసీసీ తొలిసారి అగ్రరాజ్యం అమెరికాలో టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా..

ఈ రెండు జట్లు తొలిసారి వరల్డ్‌కప్ బరిలోకి దిగనున్నాయి. అనిశ్చితికి మారుపేరైన టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కాగా.. కలిసొచ్చిన రోజున ఎంతటి ప్రత్యర్థులనైనా మట్టికరిపించగల సత్తా  తమలో ఉందని ఇప్పటికే అమెరికా, కెనడా నిరూపించుకున్నాయి. మరో రెండు రోజుల్లో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. గ్రూప్ నుంచి బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్ల వివరాలు ఓసారి పరిశీలిద్దాం.. 

ఉత్తర భారతీయులు అధికంగా స్థిరపడ్డా కెనడా.. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులు వేస్తోంది. 19వ శతాబ్దంలోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన చరిత్ర ఉన్న కెనడా.. ఆ తర్వాత క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. 1979 వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా.. ఆ తర్వాత 2003 వరకు మరోసారి ఆ ఘనత దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధిస్తూ వస్తున్న కెనడా 2007, 2011 ప్రపంచకప్‌లకు నేరుగా అర్హత పొందింది. 2018లో ఐసీసీ అన్నీ టీ20 మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోద ప్రకటించగా.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన కెనడా వన్డే హోదాను తిరిగి పొందింది.

సాద్ బిన్ జాఫర్ కెప్టెన్సీలో మెగాటోర్నీకి సిద్ధమైన కెనడా జట్టు.. ఆల్‌రౌండర్లపైనే ఆశలు పెట్టుకుంది. గ్రూప్ నుంచి పోటీ పడుతున్న కెనడా.. టోర్నీ ఆరంభ పోరు (జూన్ 2)లో అమెరికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ తర్వాత జూన్ 7న కెనడాతో, 11న పాకిస్థాన్‌తో, 15తో టీమిండియాతో తలపడనుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సూపర్ దశకు చేరనుండ గా.. భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను దాటుకొని ముందంజ వేడయం దాదాపు అసాధ్యమే. కానీ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా లెక్కచేయమని ఇప్పటి కే వెల్లడించిన కెనడా కెప్టెన్.. అమెరికా, ఐర్లాండ్ తో పాటు పాకిస్థాన్‌కు కూడా ఝలక్ ఇవ్వాలనుకుం టున్నామని చెప్పాడు. మరి పొట్టి ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగుతున్న కెనడా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.