పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలి
పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మే 23 (విజయక్రాంతి): అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా స్కూళ్లలో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారుల ను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి చౌరస్తా, సంగాయిపేట్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేయాల్సిన మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూళ్లలో నీటి సరఫ రా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదొడ్ల మరమ్మతు, నీటి సదుపాయం పనుల పై సంబంధిత జిల్లా విద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.
పనులు నాణ్యతతో చేయించాలని, ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఆయా శాఖల అధికారు లు సమన్వయంతో పనులు గడువులోగా పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలో ఎంపికైన 562 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60శాతం పనులు పూర్తయ్యాయని డీఈవో కలెక్టర్‌కు వివరించగా, మిగతా పనులు వారంలోగా పూర్తి చేసి పెయింటింగ్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు మండలస్థాయిలో పనుల పురోగతి పై సమీక్షించి త్వరితగతిన పూర్తయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యాత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో రాధాకృష్ణ, ఎంఈవో నీలకంఠం, ఏఈ మహేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






