06-08-2025 01:02:30 AM
- అందజేసిన రెప్కో బ్యాంక్ అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన రెప్కో బ్యాంక్ చైర్మన్ ఇ. సంతానం, డైరెక్టర్ రెప్కో బ్యాంక్, చైర్మన్- రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, సి తంగరాజు, ఓఎం గోకుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దీని మేనేజింగ్ డైరెక్టర్ 2024 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం వద్ద ఉన్న రూ.76.32 కోట్ల షేర్ క్యాపిటల్పు 30శాతం డివిడెండ్ కింద రూ.22.90 కోట్ల చెక్కును (బ్యాంక్ చరిత్రలో అత్యధికం) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సోమవారం హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఐఏఎస్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ ఎఫ్‌ఎఫ్‌ఆర్) డాక్టర్ రాజేంద్ర కుమా ర్, ఐఏఎస్ సమక్షంలో అందజేశారు. బ్యాం కు డైరెక్టర్లుగా ఉన్న ఆర్ ప్రసన్న, ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ (ఎఫ్‌ఎఫ్‌ఆర్ డివిజన్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయిం ట్ సెక్రటరీ (ఆరెఎస్) మక్ఖాన్ లాల్ మీనా కూడా హాజరయ్యారు. 2024 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.140 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది బ్యాంకు చరిత్రలోనే అత్యధికం. అత్యధిక లాభాన్ని నమోదు చేసినందుకు కేంద్ర మంత్రి టీమ్ రెప్కో బ్యాంకును అభినందించారు.