31-12-2024 12:56:20 AM
వెల్లింగ్టన్: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా కొత్త సీజన్‌ను విజయంతో ఆరంభించింది. అక్టోబర్‌లో చైనా ఓపెన్ అనంతరం గాయం తో మూడు నెలల పాటు ఆటకు దూరమైన ఒసాకా ఏఎస్ బీ టెన్నిస్ క్లాసి క్ టోర్నీలో శు భారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఒసాకా 6 6 క్వాలిఫయర్ లినా గ్లుస్కోను చిత్తుగా ఓడించింది.
జతకట్టిన జొకోవిచ్, కిర్గియోస్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సిద్ధమవుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, నిక్ కిర్గియోస్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో జత కట్టారు. టోర్నీలో భాగం గా సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో జొకో జోడీ 6 6 (7/4), 10 అలెగ్జాండర్ ఎర్లెర్ ఆండ్రియా మైస్ జంటపై విజయం సాధించింది. కిర్గియోస్ 18 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడగా.. ఈ ఏడాది చివరి ఏటీపీ టూర్ ఫైనల్స్‌కు జొకోవిచ్ దూరంగా ఉన్నాడు.