31-12-2024 12:50:38 AM
బెంగాల్, కేరళ అమీతుమీ
హైదరాబాద్: నెలన్నర రోజుల పాటు అలరించిన సంతోష్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. హైదరాబాద్‌లోని డెక్కన్ ఎరీనా క్లబ్ వేదికగా నేడు బెంగాల్, కేరళ మధ్య టైటిల్ పోరు జరగనుంది. రికార్డు స్థాయిలో 32 సార్లు టైటిల్ కైవసం చేసుకున్న బెంగాల్ జట్టు ఫైనల్ ఆడడం ఇది 47వ సారి. 2017 2021 22లో సంతోష్ ట్రోఫీ నెగ్గిన కేరళ మొత్తంగా 15 సార్లు ఫైనల్స్ ఆడగా.. ఏడుసార్లు విజేతగా నిలిచింది.
టోర్నీలో ఆది నుంచి రెండు జట్లు బ లంగానే కనిపించాయి. తాము ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తొమ్మిది గెలిచి ఒకటి డ్రా చేసుకున్నాయి. టోర్నీలో కేరళ 35 గోల్స్ కొట్టగా.. బెంగాల్ 27 గోల్స్ చేసింది. కేరళ తరఫున ముహమ్మద్ (9).. బెంగాల్ తరఫున రొబీ హన్సా(11) గోల్స్‌తో కొనసాగుతున్నారు.