20-11-2025 09:00:51 AM
హైదరాబాద్: బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court) ఇవ్వనుంది. శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో గురువారం సర్వోన్నత ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అన్ని పక్షాల వాదనలు విని సెప్టెంబర్ 11న భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.