calender_icon.png 20 November, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖలో అగ్నిప్రమాదం.. కార్ల షోరూమ్‌లో ఎగసిపడిన మంటలు

20-11-2025 10:38:53 AM

మద్దిలపాలెం: విశాఖపట్నం(Visakhapatnam) మద్దిలపాలెం వద్ద కార్ల షోరూమ్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి 2 కార్లు దగ్ధం కాగా, మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగడంతో అప్రమత్తమై కార్ల షోరూమ్ సిబ్బంది మిగిలిన వస్తువులను బయటకు తరలిస్తున్నారు. మంటలతో సెల్లార్ నుంచి దట్టంగా పొగ బయటకు వస్తోంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా సంభవించింది? ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.