calender_icon.png 20 November, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం గుట్టయ్య సెంటర్‌లో దారుణం

20-11-2025 10:15:33 AM

హైదరాబాద్: ఖమ్మం నగరం(Khammam city) గట్టయ్య సెంటర్లో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు. భర్త దాడిలో భార్య గోగుల సాయివాణి(36) అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన కుమార్తెపైనా నిందితుడు కత్తితో దాడి చేశాడు. తండ్రి దాడిలో గాయపడిన కుమార్తెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం యువతి కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. నిందితుడిని భాస్కర్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.