17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

తల్లి, బిడ్డలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం: అంగన్వాడి సూపర్‌వైజర్ యాదమ్మ

13-06-2025 08:10 PM

చండూరు,(విజయక్రాంతి): తల్లి, బిడ్డలకు సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నామని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ యాదమ్మ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోని ధోనిపాముల గ్రామంలో అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మూడు సంవత్సరాల పిల్లల గృహ సందర్శన చేసి వాళ్లను అంగన్వాడి కేంద్రాలకు పంపాలని ఆమె అన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని, అంగన్వాడి కేంద్రాలలో ఎగ్ బిర్యానీ కూడా చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. చిన్నారులకు ఆటపాటలతో విద్యనందిస్తారని, ప్రతి ఒక్కతల్లిదండ్రులు మూడు సంవత్సరాల నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సులోచన, ఝాన్సీ, అనిత, పంచాయతీ కార్యదర్శి అశోక్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ నాగలక్ష్మి, తారక, ఆయా సైదమ్మ, తల్లులు పాల్గొన్నారు.