23 June, 2026 | 1:13 AM

మాటల్లోనే ఎడ్యుకేషన్ హబ్!

23-06-2026 12:00 AM
  1. ఎన్నికల హామీగా మారిన ఉన్నత విద్య 
  2. అమలుకు నోచుకోని హామీలు 
  3. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న జిల్లా విద్యార్థులు

కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి నీ ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు ప్రజా ప్రతినిధులు హామీలున్నారు. ఎన్నికల తర్వాత ఎన్నికల హబ్ గురించి మర్చిపోతున్నారు. దీంతో ఉన్నత విద్య చదువుకునేందుకు స్థానిక విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండడం లేదు. దీంతో డిగ్రీ వరకు చదివిన విద్యార్థులు ఉన్నత పీజీవిద్య కోసం ఇతర ప్రాంతాల కు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కోర్సులు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నాయి.

ఎంతోమంది చదివి ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారు. ఎంతో చరిత్ర కలిగిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థులు డిగ్రీ చదివిన తర్వాత ఉన్నత విద్యా చదివినందుకు అందుబాటులో కోర్సులు లేవు. దీంతో పేద విద్యార్థు లు ఉన్నత విద్య చదివి ఎందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రజా ప్రతినిధులు అధికారులు కామారెడ్డిలో ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్ది స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులో తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కోరుతున్నారు. 

స్థలం అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు లేవు 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం ఎక్కువగా ఉన్న ఉన్నత విద్య అందుబాటులో లేక ఇతర జిల్లాలకు వెళ్లి విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాల్సి వస్తుంది. స్థానికంగా ఏర్పాటు చేసేందుకు స్థలం అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు మంజూరు చేసి నిధులు మంజూరు చేస్తే ఉన్నత విద్య కోర్సులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు పట్టించుకోని ఉన్నత విద్యను స్థానిక విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నత విద్యను అందించాలని ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను పలుసార్లు అందజేశారు. హామీలు ఇస్తున్నారు తప్ప ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుంది. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి కొందరు విద్యార్థులు ఆర్థికంగా లేకపోవడంతో ఉన్నత విద్యా చదవకుండా పుల్ స్టాప్ పెడుతున్నారు. 

ప్రజా ప్రతినిధుల హామీలను నెరవేర్చాలి 

కామారెడ్డిని ఎడ్యుకేషన్  హబ్బుగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పటికైనా పేద మధ్యతరగతి విద్యార్థుల సౌకర్యార్థం ఉన్నత విద్య కోర్సులను కామారెడ్డిలో ఏర్పాటు చేయాలి. గతంలో వినతి పత్రాలను అందజేశాము. ఎవరు కూడా స్పందించడం లేదు. 

- కోయల్ కర్ వినయ్ కుమార్, తెలంగాణ సేన జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు, కామారెడ్డి 

ఉన్నత విద్య కోర్సులు ఏర్పాటు చేయాలి 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులను ఏర్పాటు చేయాలి. డిగ్రీ చదివిన విద్యార్థులకు పీజీ చదివేందుకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు ఉన్నత విద్యా చదవలేక పులిస్టాప్ పెడుతున్నారు. 

- అర్చన, డిగ్రీ విద్యార్థిని, కామారెడ్డి 

ఉన్నత విద్య కోర్సులు ఏర్పాటుకు ప్రయత్నం 

ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులను ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య అందించాలని వినతి పత్రాలను అందజేశాం. హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఉన్నత విద్య కోసం కామారెడ్డిలో సౌకర్యాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోర్సులు ఏర్పాటు చేయాల అని కోరుకుంటున్నా.

- డాక్టర్ విజయ్ కుమార్,  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కామారెడ్డి