12 May, 2026 | 7:54 PM

కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

12-05-2026 06:48 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట్ల ధర్మయ్య గారి కుమారుడు క్రాంతి ఇటీవలే గుండె పోటుతో మరణించిన విషయం తెలుసుకున్న నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం పరామర్శించారు. వారి స్వగృహానికి వెళ్లి ధర్మయ్య గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు .వేసవి లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడెం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.