ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై విచారణ జరపాలి
ఎంఈఓకు ఏబీవీపీ వినతి
మొయినాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): మండలంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో సాగుతున్న అక్రమాలపై సమ గ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు మండల విద్యాధికారి (ఎంఈఓ)కి వినతిపత్రం అందజేశారు. ప్ర భుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీ జులు వసూలు చేస్తున్నారని, నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలం టూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
నిబంధనలు మీరే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసిన ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంజయ్, చందు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






