సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ జరిపించాలి
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి
ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి పాశం మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రెటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి (టీయూజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని అర్థమవుతుందన్నారు. మరణించిన కార్మికులు, క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంబం ధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి, సెక్షన్ 304 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయ లు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల న్నారు.
ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చారు.




