02-07-2025 01:26:21 AM
మందమర్రి, జూలై 1 : పట్టణ పోలీస్ సర్కిల్ పరిధిలో మొబైల్ ఫోన్ వినియోగ దారులు పోగొట్టుకున్న ఫోన్లను పట్టణ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందచేశా రు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి బాధితులకు మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేసి మాట్లా డారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు పోగొట్టుకున్న, చోరీ కి గురైన 197 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇటీవల రికవరీ చేసిన 1.2 లక్షల విలువైన 7 మొబైల్ ఫోన్ల ను బాధితులకు అందచేశారు.
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సిఈఐఆర్ పోర్టల్లో 280 ఫిర్యాదులు నమోదు కాగా, ప్రత్యేక బృందాల కృషితో 197 ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అప్పగించా మని, మిగిలిన ఫోన్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. www.ceir.gov.in వ్బుసైట్లోకి వెళ్లి ఫోన్ను బ్లాక్ చేయాలని, అదే విధంగా ఎవరైనా గు ర్తు తెలియని వ్యక్తులు తక్కువ ధరకు మొబైల్ ఫోన్లు అమ్మినట్లయితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దని అటువంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందచేయాలని కోరారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర పోషించిన టెక్నికల్ టీం కానిస్టేబుల్ శ్రీనివాస్ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకం గా అభినందించారు. ఈ కార్య క్రమంలో పట్టణ ఎస్‌ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.