అంతా వారి చలవే
మన ప్రాజెక్టులకు మరణశాసనం రాసింది బీఆర్‌ఎస్ సర్కారే
- బనకచర్లతో మళ్లీ ఊపిరిపోసుకోవాలని ఆరాటం
- కేసీఆర్, హరీశ్‌రావు నిర్ణయాలే గుదిబండగా మారాయి
- తెలంగాణకు ఒక్కపంటకే నీళ్లు లేవంటే.. ఏపీ మూడోపంటకు పాకులాడుతోంది
- ఉత్తమ్‌కు, నాకు రొయ్యల పులుసుతో పనిలేదు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
- బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు కిషన్‌రెడ్డి తాపత్రయం
- పోలవరం-బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ‘నీళ్లకు నాగరికతకు ఎంత సంబంధం ఉందో.. నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతే సంబంధం ఉంది.. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. నీళ్ల విషయం లో తెలంగాణ ప్రజలందరికీ ఏకాభిప్రా యం ఉంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, హరీశ్ రావు సీఎం, సాగునీటి మంత్రులుగా ఉన్నారని.. నిర్లక్ష్యమో, అహంకారమో తెలియదు కానీ వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయన్నా రు.
వారే మన ప్రాజెక్టులకు మరణశాసనం రాశారని ఆరోపించారు. పార్టీ పునరుజ్జీవం కోసం బీఆర్‌ఎస్ నేతలు తాపత్రయ పడుతున్నారని.. అందుకే తిరిగి నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాభవన్‌లో మంగళవా రం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన బనకచర్ల లింక్ ప్రాజె క్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.. రాష్ర్ట విభజన సందర్భంలో నీళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతాయని అప్ప టి ప్రధాని మన్మోహన్‌సింగ్ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారని తెలిపా రు.
ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారని.. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని 2015, జూన్ 18న జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి మరణశాసనం రాసి నీటి కేటాయింపులపై కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టి వచ్చారన్నారు. 68శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని సంతకం చేశారని అన్నారు.
కల్వకుర్తి, పాలమూరు, ఎస్‌ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం పూర్తి చేయలేదని..దీంతో తెలంగాణకు 299 టీఎంసీలను కూడా వాడుకోలేకపోయామన్నారు. ఉమ్మడి రా ష్ర్టంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూ ర్తి చేయకపోవడం వల్లే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేకపోయిందన్నారు. ఏపీ మాత్రం పూర్తి చేసిన ప్రాజెక్టులతో నీటిని తరలించుకుపోతోందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలు చెప్ప డం వల్లే అధికారాన్ని కోల్పోయారని రేవంత్‌రెడ్డి అన్నారు. కనీసం డిపాజిట్లు దక్కిం చుకునేందుకు కూడా వారి అభ్యర్థులు ఇబ్బ ందులు పడ్డారని ఎద్దేవా చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి అభ్యర్థులే దొరకలేదన్నారు.
నీళ్ల సెంటిమెం ట్ కోసమే పక్క రాష్ట్రం సీఎం చంద్రబా బు తోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భూతాలు గా చూపుతు న్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో కూర్చుని క్షుద్రపూజలు చేసినట్లుగా ఆలోచనలు చేస్తున్నారని ధ్వజమె త్తారు.
నికర జలాలపై అభ్యంతరం ఎందుకు..
మీరేమో మిగులు జలాలపై బనకచర్ల వంటి ప్రాజెక్టులు కట్టుకునేందుకు మూడో పంటకు నీళ్లు పారించుకునేందుకు ప్రయత్నిస్తూ..తెలంగాణలో నికర జలాలపై ఆధార పడిన ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటూ కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లు రాకుండా చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు చేశారు.
90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్ల కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నదని ప్రశ్నించారు. నికర జలాల వాడు కుంటాం అంటే అభ్యంతరం చెప్తూ వరద జలాల మీద మాత్రం ఏపీ తమపై కోట్లాడుతోందన్నారు.
దీనికి ఇరురాష్ట్రాలు చర్చల తోనే పరిష్కారం చేసుకోవాలన్నారు. పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ర్టం హక్కుల ను తాకట్టు పెడతామా అని పేర్కొన్నారు. చంద్రబాబు మేల్కొని..తెలంగాణను ఇరకాటంలోకి నెట్టారని..చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా..గోదావరి నీళ్లు తీసుకుపోవాలనేదే వారి విధానమని తెలిపారు.
దీనికి కేంద్రం కూడా పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సార్లు తాము కిషన్‌రెడ్డిని అడిగామని, అధికారులను పంపి వివరాలు ఇచ్చామని, కానీ ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీకి మనుగడ తేవాలని కిషన్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ధనదాహంతో రీ ఇంజినీరింగ్..
తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ధనదా హం తో రీ ఇంజినీరింగ్ పేరిట ఊరుపేరు, అంచనాలు మార్చారని..లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గోదా వరి బేసిన్‌లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాల లెక్క తేలుతుందన్నారు.
మిగులు, వరద జలాల లెక్కతేలాలంటే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలన్నారు. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, నాకు రాయలసీమ రొయ్యల పులుసు తో పనిలేదు- తెలంగాణ ప్రజల హక్కులతోనే పని..’ అని అన్నారు. ఇందుకోసం న్యా యమైన విధానంతో ఎక్కడైనా కొట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘హరీశ్‌రావు..రెండు రోజులు అసెం బ్లీ ప్రత్యేక సమావేశాలు పెడదాం.
ఒక రోజు కృష్ణా బేసిన్‌పై, ఇంకో రోజు గోదావరి బేసిన్‌పై చర్చ పెడదాం. స్పీకర్ ఫార్మాట్‌లో స్పీక ర్‌కు లేఖ రాయండి. ఈ రాచపుండును తెలంగాణ ప్రజలకు అంటగట్టింది ఎవరో తేలాల్సిన అవసరం ఉంది..’ అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌తో పంచాయితీ కాదని, మన హక్కులను ఎలా సాధించుకోవాలో తెలిపేందుకే ఈ సమావేశమని ఆయన చెప్పారు. తమ ఫోకస్ అంతా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు ప్రయత్నం చేస్తోందని.. ఇందుకు కిషన్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి మాట్లా డే ప్రతీమాట కేటీఆర్ ఆఫీస్ నుంచే వస్తున్నదన్నారు. కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అను మానాలు కలిగిస్తోందని..తెలంగాణ ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.
‘బీజేపీ నూ తన అధ్యక్షుడు రాంచందర్‌రావుకు విజ్ఞప్తి చేస్తు న్నా..మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య.. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణ తీసుకుని ప్రధాని దృష్టికి తీసుకెళ్లండి. ఇందు కు కావాల్సిన సమాచారం మా మంత్రులు అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు..’ అని రేవంత్‌రెడ్డి సూచించారు.
బనకచర్లకు పునాది బీఆర్‌ఎస్ పాలనలోనే..
- తాము గట్టి ప్రయత్నం చేయడం వల్లే అనుమతి నిరాకరణ
- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజె క్టు చేపట్టిందే బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడని.. ఇప్పుడు నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నార ని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బనకచర్ల లింక్‌పై తమ గట్టి ప్రయ త్నం వల్లే కేంద్రం అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అప్పటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం చర్చలు జరిపారని, బీఆర్‌ఎస్ హయాంలోనే ఈ మోసానికి పునా ది పడిందన్నారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారని, 2018 మార్చి, జూన్, సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా జీవోలు ఇచ్చినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదన్నారు.
గోదావరి జలాలు కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు అప్పటి సీఎం జగన్‌తో చర్చలు జరిపిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నడుమ అధికారులు, -నిపుణులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసిందే నాటి పాలకులని అన్నారు. అన్నీ ఒప్పందాలు కుదుర్చుకున్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాకే సమర్థవంతంగా ఈ కుట్రలను ఎదుర్కొన్నామన్నారు. గోదావరి జలాల్లో రాష్ట్రం నీటి వాటా కాపాడుకునేందుకు ఏపీ ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించినట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, తాను స్వయంగా కేంద్రానికి వివరించి నందునే ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారని ఉత్తమ్ వెల్లడించారు.
ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. కార్యక్రమానికి డిఫ్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.




