13-09-2025 03:45:14 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి)/మణికొండ: ఎగువ ప్రాం తాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో హైదరాబాద్‌కు తాగునీటిని అందిం చే ప్రధాన జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్ నిండుకుండలా మారింది. జలాశ యం పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా శుక్రవారం నాటికి జలాశ యంలోకి 2000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం ప్రమాదకర స్థా యికి, అంటే 1789.50 అడుగులకు చేరుకుంది.
జలాశయంలోకి వస్తున్న భారీ వరద ను నియంత్రించేందుకు, నీటిమట్టాన్ని అదుపులో ఉంచేందుకు జలమండలి అధికా రులు శుక్రవారం ఉస్మాన్‌సాగర్ డ్యామ్ ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి, 2,652 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి 2,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో నిరంతరాయంగా కొనసాగుతోంది.
ఆరు గేట్లను ఎత్తడంతో నీరు మూసీలోకి చేరి, మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నది ప్రవాహం అధికంగా ఉండటంతో నార్సింగిణామంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి నీరు ప్రవ హిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఇరువైపులా రాకపో కలను పూర్తిగా నిలిపివేశారు. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, గత రెండు రోజులుగా కురుస్తు న్న వర్షాలకు ఏకంగా 4,000 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. జలాశయం నీటిమట్టం 1763.20 అడుగులకు చేరడంతో అధికారులు నాలుగు గేట్లను నాలుగు అడుగుల ఎత్తున పైకెత్తి 5354 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరిక
మూసీలో వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీ సు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజ లను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, సురక్షిత ప్రాం తాలకు తరలి వెళ్లాలని, పశువులను నది వైపు పంపవద్దని సూచించారు.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని డీజీఎమ్ ఉస్మాన్‌సాగర్ కార్యాలయం ప్రజలను కోరింది. జలమండలి అధికారులు జలాశయం నీటిమ ట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే, గేట్లను మరింత ఎత్తే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.