18 April, 2026 | 6:31 AM

బెజగాంలో గుర్తించిన అపూర్వ సతిశిల

02-07-2025 01:13 AM

సిద్దిపేట, జూలై 1 (విజయక్రాంతి): గజ్వేల్ మండలం బెజగాంలో అపూర్వ సతిశిల ఇటీవల జైన తీర్థంకరుల శిల్పాలు వెలుగుచూసిన చోటనే కొత్త సతిశిలతో పాటు, శూలారోహణ ఆత్మాహుతి, ఇతర వీరగల్లులనుహొగుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.

ఈ సతిశిల ఇంతకు ముందెన్నడు అగుపించని, అరుదైన వీరస్మారకశిల, ఈ శిల్పంలో వీరుడుహొతలమీద పెద్దసిగతో, చెవులకు జూకాలు, మెడలో కంటె, జంధ్యం, హస్తభూషణాలు, నడుమున దట్టీ, వీరకాసె, చేతులలో ఈటెతో, డాకాలు సాచి, యుద్దానికి సిద్ధమై ఉన్నాడు, వీరునికికుడిపక్కన పెద్ద ధమ్మిల్లంతో, చెవులకు జూకాలతో, మెడలో హారం, నడుమున నీవీబంధం, చేతులలో ఈటెతో శత్రువును చంపుతున్న వీరనారి నిలబడివుంది. వీరునికి ఎడమవైపున పెద్ద ధమ్మిల్లంతో, జూకాలతో, మెడలో హారంతో, నడుమున మేఖల కుడిచేతిలో పువ్వు, ఎడమచేత కమండలం పట్టుకొని కనిపిస్తున్న స్త్రీ ఆ వీరుని సతి.హొవీరునిహొకుడి పక్కన ఈటెతో శత్రువుని చంపుతున్న ఆ నారీమణి కూడా వీరుని వీరపత్నే. బహుశా ఈ వీరునికి ఇద్దరు భార్యలు ఉండచ్చు. అక్కడ 1జరిగిన పోరులో భర్తతో పాటు పోరాడిన భార్య కూడా చనిపోయింది. మిగిలిన మరొక భార్య భర్తతో పాటు సతీసహగమనం చేసిందనీ శ్రీనివాస్ తెలిపారు.

ఇటువంటి వీరస్మారకశిల ఇంతకు ముందెన్నడు లభించలేదని, ఈ సతిశిల కళ్యాణీ చాళుక్యుల కాలానికి చెందిందని చరిత్రబందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ఈ పరిశీలనలో కొలిపాక శ్రీనివాస్ వెంట గ్రామస్తులు నర్రా కళాధర్, నాంపల్లి స్వామి, శ్యాంకుమార్ ఉన్నారు.