20 August, 2026 | 4:07 AM

ప్రతి ఓటరుకు అవకాశం కల్పించాలి

20-08-2026 12:07 AM

తాసీల్దార్ సురేందర్

శంకర్‌పల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): క్షేత్రస్థాయి సిబ్బంది తమ పరిధిలోని సర్ ప్ర క్రియను సమన్వయంతో నిర్వహిస్తూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని శంకర్ పల్లి తాసిల్దార్ సురేందర్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బిఎల్‌ఓ సూపర్వైజర్, బిఎల్‌ఓ లకు ఓటరు జా బితా కార్యకలాపాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ ప్రచురణ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై ఓటరుకు నోటీ సుల జారీ, ఫిర్యాదులు, అభ్యంతరాల ను స్వీకరించాలని, విచారణ ప్రక్రియ, బిఎల్‌ఓ యాప్‌లో వివరాలను నమోదు వంటి అంశాలపై సిబ్బందికి సమగ్రంగా వివరించారు. సర్ ప్రక్రియలో మిగిలిపోయిన ఓటర్లకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి చూపాలని సూచించారు.

నిష్పక్షపాతమైన, ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ కోసం సమగ్రంగా ధ్రువీకరణ చేపట్టడం, కచ్చితత్వాన్ని పాటించడం, పారదర్శక తను నిర్ధారించడం, నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించడం. సర్ ప్రక్రియ ఓటర్ జాబితా కార్యకలాపాలను సమర్ధవంతంగా, సకాలంలో అమలు చేసేలా బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్వైజర్ల సామర్ధ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్ కుమార్, డీటీ బాలకృష్ణారెడ్డి, మాస్టర్ ట్రైనర్ ఆశీర్వాదం, సిబ్బంది పాల్గొన్నారు.