20 August, 2026 | 4:58 AM

వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

20-08-2026 12:06 AM

దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్

ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాం తి): ప్రపంచ వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్ర స్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కృ ష్ణ మండలం ముడుమాల్లోని విశిష్ట మెగాలిథిక్ మెన్హిర్స్, స్టోన్ సర్కిల్స్, సమాధులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ), తెలంగాణ వారసత్వ శాఖ, దక్కన్ హె రిటేజ్ అకాడమీ ట్రస్ట్ అధికారులు, పురావ స్తు నిపుణులు సంయుక్తంగా పరిశీలించిన ట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముడుమాల్ ఇప్పటికే యునెస్కో ప్రపం చ వారసత్వ తాత్కాలిక జాబితాలో ఉందని, చేర్చేందుకు అధ్యయనాలు, డాక్యుమెంటేష న్ కొనసాగుతున్నాయని ఏఎస్‌ఐ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియా లజిస్ట్ డా.నిహిల్ దాస్ తెలిపారు. 2, 3 వేల ఏళ్ల నాటి మెన్హిర్లు, స్టోన్ సర్కిల్స్, ఖగోళ-సూర్యగమన సంబంధాలు ఈ ప్రాంతానికి ప్ర త్యేకతనిస్తున్నాయని పేర్కొన్నారు. అంబేకర్ ముడుమాల్ను సహజ స్వరూపానికి భంగం కలగకుండా సంరక్షించాలని ఏఎస్‌ఐ అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డా.రోహిణి పాండే సూచించారు.