8 August, 2026 | 2:25 AM

ప్రజావసరాలకు అనుగుణంగా అండర్ పాస్ నిర్మించాలి

08-08-2026 12:11 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : జాతీయ రహదారిపై ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండర్ పాస్ నిర్మించాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సూచించారు. శుక్రవారం జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కోహిర్  మండలం దిగ్వాల్ గ్రామంలో నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జిని పరిశీలించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని అధికారులకు సూచించారు. దిగ్వాల్ గ్రామ ప్రజలకు ఏ కాకుండా చుట్టుపక్కల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేతో పాటు జరాసంఘం , జహీరాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, తట్టు నారాయణ, నాయకులు బొగ్గుల సంగమేశ్వర్, సర్పంచ్ సోహెల్, శ్రీనివాసరెడ్డి, కరన్ రాజ్, విట్టల్ రెడ్డి పటేల్, ముద్దాసీర్ ,జుబేర్ ,జావేద్ ,వినోద్ షాహిద్, అశోక్ ,జగన్ తదితరులు పాల్గొన్నారు.