23 August, 2026 | 6:37 AM

ఊహించని ప్రమాదం

22-05-2024 02:19 AM

చెట్టు విరిగిపడి భర్త మృతి, భార్యకు గాయాలు

మేడ్చల్, మే 21 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బొల్లారంలోని కంటోన్మెంట్ దవాఖాన వద్ద పెను విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున దవాఖానకు చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు విరిగిపడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాల అయ్యాయి. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండలంలోని తూంకుంటలో రవీందర్, సరళదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ దవాఖానకు రవీందర్(48), సరళాదేవి దంపతులు చికిత్స కోసం వస్తున్న క్రమంలో దవాఖాన గేటు వద్దకు రాగానే పక్కనున్న భారీ వృక్షం వారిపై కూలి పడింది.

ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయి. సరళాదేవిని చికిత్స నిమత్తం దవాఖానకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సరళాదేవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు సమాచారం.