13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

27-03-2026 07:55 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): గుర్తుతెలియని ఓ వృద్ధురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ లోని సిపిఐ కాలనీలో వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈనెల 2న వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలుని గాంధీ ధావకానకు తరలించి చికిత్స అందించారు. ఈ నెల 22న వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిందని గాంధీ వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని ఆమెకు ఎవరూ లేరని పోలీసుల విచారణ లో తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.