02-07-2025 01:11:07 AM
తూప్రాన్, జులై 1 : తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో తడి పొడి చెత్త వేరు చేయు విధానంపై అవగాహణ సదస్సును మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, ప్లాస్టిక్ వాడడం వలన కలిగే అనర్దాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
మునిసిపల్ కార్యాలయంలో భర్దన్ బ్యాంక్, మెప్మా సహకారంతో నిర్వ హించడం జరిగింది. పలు వార్డులలో వర్షపు నీరు గుంతలలో నిల్వకుండ మొరం వేయడం జరిగింది. మురికి కాలువలలో చెత్త చెదారం, ప్లాస్టిక్ చేరువులోకి పోకుండా జాలి వేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. 12వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ తనికి చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.