calender_icon.png 31 July, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్ వాడీ కేంద్రం తనిఖీ

30-07-2025 09:44:54 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ-3 అంగన్ వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా సంక్షేమ అధికారి, ఐసీడీఎస్ పీడీ రౌఫ్ ఖాన్(ICDS PD Rauf Khan) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రంలో హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించి.. చిన్నారులకు, లబ్ధిదారులకు అందిస్తున్న పోషకాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు అంగన్ వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఎన్. పద్మ, ఏఎన్ఎం నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.