30-07-2025 10:14:38 PM
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ.స్వప్న..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పుట్టిన వెంటనే ప్రారంభమయ్యే టీకా ప్రక్రియ ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరి అని మెడికల్ ఆఫీసర్ స్వప్న(Medical Officer Swapna) పేర్కొన్నారు. బుధవారం ఉప్పునుంతల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకా కార్యక్రమం నిర్వహించారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ ఉన్న చిన్నారులకు వివిధ వ్యాధుల నుండి రక్షణ కలిగించేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తుందని, తల్లిదండ్రులు తమ బాధ్యతగా ఈ టీకాలు సమయానికి వేయించాలన్నారు. టీకాలు వేసిన పిల్లలే భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.