3 April, 2026 | 3:36 AM

కొండగట్టులో అంజన్న జయంతి

03-04-2026 01:59 AM

భారీగా తరలివచ్చిన భక్తులు

జగిత్యాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం చిన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వాములు, సాధారణ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. కాషాయ దుస్తులు ధరించిన స్వాములతో ఆలయం మొత్తం కాషాయమయంగా మారింది. ‘జై హనుమాన్‘ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీటి సదుపాయం, పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలు, దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.