అమ్మవారికి అన్నాలెజ్నెవా ప్రత్యేక పూజలు
04-02-2026 02:23 AM
వరంగల్‌లోని ప్రముఖ భద్రకాళీ దేవస్థానాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా మంగళవారి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు.ముందుగా ఆదిశంకరాచార్యులు,
వల్లభ గణపతిని దర్శించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్నపన మండపంలో ప్రధాన అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్‌కుమార్ శర్మలు మహదాశీర్వచనం ఆమెకు నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ, (విజయక్రాంతి)




