05-12-2024 01:59:51 AM
పెద్దపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ ఆవిర్భవించిందని, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా వరి సాగు అవుతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రం లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి ఏడాదిలోనే రైతు సంక్షేమానికి రూ.55 వేలకోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేలకోట్ల రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశా మన్నారు.
35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 3 రోజుల్లో డబ్బులు జమ చేశా మని చెప్పారు. సన్నరకం ధాన్యానికి క్వింటా ల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నా రు. ఉచిత విద్యుత్ మొదలు బోనస్ వరకు రైతు సంక్షేమానికి ఇందిరమ్మ రాజ్యమే ప్రతీక అని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో అత్యధికంగా నీటి వనరులు ఉన్నాయని.. రైతులు ముందుకొచ్చి ఆయిల్‌పామ్ పంట వేయాలని కోరారు