05-12-2024 01:57:38 AM
రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
తగ్గిన చలి తీవ్రత
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): అరేబియా సముద్రంలో ఏర్పడినం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. అల్పపీడనం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయని పేర్కొన్నది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో బుధవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలోని తల్లాడలో అత్యధికంగా 34.8 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లా మంచెల్‌లో 8 మిల్లీ మీటర్లు, అసిఫాబాద్‌లోని జైనూర్‌లో 7.4 మిల్లీ మీటర్ల వర్షం పడినట్లు ఐఎండీ చెప్పింది.