13 August, 2026 | 3:44 AM

పావై ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్‌లో వార్షికోత్సవాలు

13-08-2026 01:44 AM

హాజరైన రంగారెడ్డి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కాటా నరేందర్ రెడ్డి

ఎల్బీనగర్ , ఆగస్టు 12 : ఎల్బీనగర్లోని పా వై ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ ఆధ్వర్యంలో ‘టూ గేదర్ ఫర్ ఎవ్రీ చైల్ బ్రైట్ ఫ్యూచర్‘ అనే నినాదంతో  బుధవారం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా బాలల సం క్షేమ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కాటా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బాలల విద్య, ఆరోగ్యం, భద్రత, మానసిక వికాసం, భవిష్యత్ అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...  బాలల హక్కుల పరిరక్షణతోపాటు వారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన వాతావరణం కల్పించ డం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పిల్లలు తమలోని ప్రతిభను గుర్తించి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. బాలల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, సృజనాత్మకతతోపాటు సమగ్ర అభివృద్ధికి పావై ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అధికారులు అభినందించారు. వా ర్షికోత్సవ కార్యక్రమంలో బాలలు ప్రదర్శించిన గ్రూప్ డ్యాన్స్, సోలో డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సీడ బ్ల్యూసీ సభ్యులు నీరజ, ఎండీ ముంతాజ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.