calender_icon.png 22 January, 2026 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగమేశ్వర్‌లో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 13వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

22-01-2026 06:34:47 PM

సంగమేశ్వర్‌లో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 13వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

కామారెడ్డి అర్బన్,జనవరి 22,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్వామివారికి అభిషేకంతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ చైర్మన్ లోయపల్లి శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ బాలరెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్, మాజీ ఆలయ అధ్యక్షుడు పుట్ట బాపురెడ్డి, ఆలయ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.