calender_icon.png 22 January, 2026 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై చెత్త వేయకూడదని దండోరా వేయించిన సర్పంచ్

22-01-2026 06:29:13 PM

బెజ్జూర్,జనవరి 22, (విజయక్రాంతి): రోడ్లపై చెత్త వేయకూడదని సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి గ్రామంలో దండోర వేయించారు. బెజ్జూర్ మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీలలో రోడ్లపై చెత్త వేయకూడదని దండోరా వేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదని తెలిపారు. గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.