22-01-2026 06:31:43 PM
నాగిరెడ్డిపేట్,జనవరి 22 (విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల గ్రామ సంఘం మహిళా శక్తి భవనానికి స్థలం ఇవ్వాలని కోరుతూ అక్కంపల్లి గ్రామ మహిళా సంఘం సభ్యులు స్థానిక డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్ వినతి పత్రాన్ని అందజేశారు.అక్కంపల్లి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 95/1 స్థలాన్ని ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేత ప్రతి మహిళ సంఘంకు 200 గజాల స్థలంను అక్కంపల్లి గ్రామ మహిళా సంఘంనికి స్థలాన్ని కేటాయించాలని,మహిళా సంఘం సభ్యురాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు బండ లావణ్య,కార్యదర్శి ఎరుకల లక్ష్మి,సభ్యులు సుజాత, సాయవ్వ,సంధ్యారాణి, మంజుల,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.