22 August, 2026 | 1:13 AM

26న ‘వికలాంగుల వాయిస్’ 12వ వార్షికోత్సవం

22-08-2026 12:25 AM

రాజ్యాంగ హక్కులు భావప్రకటన స్వేచ్ఛ సవాళ్లు అంశంపై సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవాలు ఈ నెల 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని వికలాంగుల వాయిస్ మాస పత్రిక గౌరవ సల హాదారులు పి ఉమ్మర్‌ఖాన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే వార్షికోత్సవల పోస్టర్‌ను వికలాంగుల వాయిస్ ఎడిటర్ ఎం అడివయ్య, మేనేజర్ కె వెంకట్, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, హెచ్ ఖే రిహబిలిషన్ డైరెక్టర్స్ అర్ముగాం, శశిధర్ రెడ్డి తో కలిసి హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల ప్రాంగణంలో అయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగుల్లో చైతన్యం తెచ్చేందుకు నడుస్తున్న ఏకైక మాస పత్రిక వికలాంగుల వాయిస్ మాస పత్రిక అని, గత 11 ఏండ్లుగా పత్రిక నిరంతరాయంగా నడుపుతున్నామన్నారు. దివ్యాంగులపోరాటాలకు దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు.

హక్కుల కోసం దివ్యాంగులు చేస్తున్న పోరాటాలకు మార్గదర్శిగా వికలాంగుల వాయిస్ ఉందని అన్నారు. చట్టాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సమాచారం దివ్యాంగుల్లోకి తీసుకెళ్లడానికి పత్రిక కృషి చేస్తుందని అన్నారు. గ్రామీ ణ ప్రాంతంలోని వికలాంగులను చైతన్యం చే యడానికి పత్రిక కృషి చేస్తుందని అన్నారు. వికలాంగుల వాయిస్ మాస పత్రిక వికలాంగుల చేతిలో ఆయుధంగా నిలుస్తుందని అన్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటి గంటకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పత్రిక 12వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.