7 September, 2026 | 9:01 AM

24 నుంచి సీపీగెట్ కౌన్సిలింగ్

22-08-2026 | 01:13am

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ (ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష) కౌన్సిలింగ్‌ను ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. తొలివిడత సీట్లను సెప్టెంబర్ 14న కేటాయిస్తారు. సీట్లు పొంది న విద్యార్థులు అదే నెల 18న ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. తరగతులు సెప్టెంబర్ 19 నుంచి షురూ కానున్నాయి.

మరిన్ని వార్తలు