22 August, 2026 | 3:36 AM

అగ్రహారంలో కన్నులపండువగా శ్రీ ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

22-08-2026 01:12 AM

మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి

కూసుమంచి, ఆగస్టు 21, (విజయక్రాంతి): కూసుమంచి మండలం  అగ్రహారం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ శోభాయాత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, కట్టుబొట్టుతో అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని కొనియాడారు.

ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఊరంతా చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కందాళ ఉపేందర్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.